Sunday, January 19, 2025

పొగాకు వస్తువులు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Man arrested for selling tobacco products
రూ.12లక్షల విలువైన వస్తువులు స్వాధీనం

హైదరాబాద్: నిషేధిత పొగాకు వస్తువులు విక్రయిస్తున్న వ్యక్తిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి విమల్ పాన్‌మసాలా, సాగర్ పాన్ మసాలా, అంబర్ జర్ధా, బొలీరో పికప్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కథనం ప్రకారం….హైదరాబాద్, మంగళ్‌హాట్‌కు చెందిన శివకుమార్ అలియాస్ రాజు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శివకుమార్ పదేళ్ల క్రితం కర్ణాటక నుంచి నగరానికి బతుకు దెరువు కోసం వచ్చాడు. ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే డబ్బులు కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో చట్టవ్యతిరేక పనులు చేస్తున్నాడు.

గుట్కా, మిగతా పొగాకు వస్తువులకు మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వాటిని రవాణా చేసుకుని డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన రమేష్ అలియాస్ రాము వద్ద గుట్కా, పొగాకు వస్తువలు కనుగోలు చేసి వస్తువులు రవాణా చేస్తున్నా సమయంలో వాటిని కూడా నగరానికి తీసుకుని వస్తున్నాడు. అవసరం ఉన్న వ్యాపారులకు వాటిని విక్రయిస్తున్నాడు. ఈ విషయం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలియడంతో దాడి చేసి నిందితుడిని పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం మంగళ్‌హాట్ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు శ్రీశైలం, నరేందర్ తదితరులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News