Friday, November 22, 2024

పోగాకు వస్తువులు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Man arrested for selling tobacco products
రూ.6లక్షల విలువైన వస్తువులు స్వాధీనం

హైదరాబాద్: నిషేధిత పొగాకు వస్తువులు విక్రయిస్తున్న వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి నిషేధిత పొగాకు వస్తువులు, విదేశీ సిగరేట్లు, బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… జగిత్యాల జిల్లా, ధర్మపురికి చెందిన గోలి రంజిత్‌కుమార్ నగరంలో పాన్ మసాలా వ్యాపారం చేస్తున్నాడు. నగరంలోని డిడి కాలనీలో ఉంటున్నాడు. గత కొంత కాలం నుంచి డ్రగ్స్, గంజాయి, పొగాకు వస్తువులపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నిందితుడు నిషేధిత పొగాకు వస్తువులు విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు దాడి చేసి విక్రయిస్తున్న వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నల్లకుంట టిఆర్‌టి క్వార్టర్స్‌ను గోడౌన్‌గా ఉపయోగించుకుంటున్నాడు. అక్కడ విదేశీ సిగరేట్లు, పొగాకు వస్తువులు నిల్వ చేస్తున్నాడు. అక్కడి నుంచి కిరాణా షాపులు, పాన్ షాపులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. నగరంలోని కిషన్‌బాగ్‌కు చెందిన ఫైజల్, ఎండి అబ్దుల్ రవూఫ్ అలియాస్ రేహాన్ నిందితుడికి నిషేధిత వస్తువులు సరఫరా చేస్తున్నారు. కేసు దర్యాప్తు కోసం నిందితుడిని నల్లకుంట పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ రఘునాథ్, ఎస్సైలు నవీన్‌కుమార్, ఎండి షానవాజ్ షఫీ, నగేష్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News