మనతెలంగాణ/హైదరాబాద్: వాట్సాప్‌లో అశ్లీల చిత్రాలకు సంబంధించిన లింకులు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, మల్‌కీజ్‌గూడ గ్రామానికి చెందిన వరికుప్పల చంద్రశేఖర్ కూలి పనిచేస్తున్నాడు. నిందితుడికి మొబైల్‌లో అశ్లీల చిత్రాలను చూసే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే నిందితుడు కొత్త సిమ్ కార్డు తీసుకున్నాడు. దానికి వాట్సాప్ క్రియేట్ చేసి వాటి ద్వారా అశ్లీలకు సంబంధించిన లింక్‌లను పలువురు యువతులకు పంపిస్తున్నాడు. బాధిత యువతికి వాట్సాప్‌లో లింక్‌ను పంపడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై మానసికంగా ఇబ్బంది పడింది. వెంటనే తన సోదరుడికి చెప్పడంతో రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ శంకర్ కేసు దర్యాప్తు చేశారు.
Man Arrested for send obscene links in WhatsAPP in Hyd