Sunday, September 8, 2024

శృంగార చిత్రాలు చూపిన యువకుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Arrest

చాంద్రాయణగుట్ట: కొంత మంది బాలికలకు సెల్‌ఫోన్లో మ్యాజిక్ ట్రిక్స్ చూపిస్తానని చెప్పి శృంగార చిత్రాలను చూపిన ఒక యువకుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ రుద్రభాస్కర్ కథనం ప్రకారం…. బండ్లగూడ గౌస్‌నగర్‌కు చెందిన తాపీ పనిచేసే అబ్దుల్ సల్మాన్ (22) గతనెల 31వ తేదీన కొంత మంది బాలికలకు సెల్‌ఫోన్లో మ్యాజిక్ ట్రిక్స్ చూపిస్తానని నమ్మించాడు. నిర్మాణంలో ఉన్న ఒక డబుల్ బెడ్ రూమ్ ఇంటిలోకి తీసుకువెళ్ళాడు. ఒకరి తరువాత ఒకరిని పిలుస్తూ వారికి శృంగార చిత్రాలను చూపించాడు. ఈ మేరకు పోలీసులకు అందిన ఫిర్యాదుతో నిందితుడు అబ్దుల్ సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఎస్సై శివతేజ దర్యాప్తు చేస్తున్నారు.

Man Arrested for Shows Pornographic Pictures

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News