Thursday, January 23, 2025

డ్రగ్స్ తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డ్రగ్స్ తరలిస్తున్న అంతరాష్ట్ర నిందితుడిని ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి వద్ద నుంచి 4.2 కిలోల గసగసాలు(పప్పీస్ట్రా), బైక్, రూ.1,700 నగదు, వెయింగ్‌మిషన్, మిక్సర్‌గ్రైండర్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.15లక్షలు ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం…రాజస్థాన్ రాష్ట్రం, బార్మర్ జిల్లా, మోక్కా కుర్దుకు చెందిన రమేష్ కుమార్, చెన్నా రామ్ కలిసి పప్పీస్ట్రాను రవాణా చేస్తున్నారు.

రమేష్‌కుమార్ పదేళ్ల క్రితం బతుకు దెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. ఇక్కడ రాహుల్ స్టీల్ రేయిలింగ్ వర్క్ పేరుతో నాగోల్‌లో షాపు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలోనే నిందితుడికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. డ్రగ్స్ విక్రయిస్తే సులభంగా డబ్బులు సంపాదించవచ్చని ప్లాన్ వేశాడు. దీని కోసం రాజస్థాన్‌కు చెందిన చెన్నారామ్‌ను సంప్రదించాడు. అతడి వద్ద నుంచి రూ.50,000లకు కిలో చొప్పున కొనుగోలు చేసి ఇక్కడ రెండు లక్షలకు విక్రయిస్తున్నాడు. పప్సీస్ట్రాను మత్తు ఉండడంతో ట్యాబ్లెట్లు, మోర్‌ఫైన్ డ్రగ్స్ తయారికి ఉపయోగిస్తారు.

అందుకే దీనిని విక్రయాలు, ఉత్పత్తిని నిషేధించారు. నిందితుడు రాజస్థాన్ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్న విషయం తెలియడంతో ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ సుధాకర్, చైతన్యపురి ఇన్స్‌స్పెక్టర్ నాగార్జున, ఎస్సైలు ప్రతాప్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News