Monday, December 23, 2024

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

అమీన్‌పూర్ ః- కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పటాన్చెరులో ఎక్సైజ్ అధికారులు బలపండి పట్టుకుని అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఆదివారం పటాన్చెరు ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ రఘురాం వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం పటాన్చెరులోని ఓఅర్‌అర్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా నమ్మదగ్గ సమాచారం లభించిందన్నారు. నల్లగొండ జిల్లా బొల్లారం పట్టి గ్రామానికి చెందిన రమావత్ రమేష్ చంద్ర TS 27 F 7775 నంబరు బలినో వాహనంలో అక్రమంగా ఎండు గంజాయి మూటలను తరలిస్తున్నారు. అతని అదుపులోని తీసుకొని కారులో ఉన్న 12 లక్షల విలువచేసే 84 కేజీల రెండు గంజాయితోపాటు కారును అక్షయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News