Monday, December 23, 2024

విమానంలో మహిళపై మూత్రవిసర్జన చేసిన వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడు శంకర్ మిశ్రాను బెంగళూరులోని స్రెంట్రల్ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ పోలీసులకు చెందిన సంయుక్త బృందం అరెస్టు చేసింది. ఉత్తర బెంగళూరులోని సంజయ్ నగర్‌ప్రారంతోలని తన కార్యాలయంలోనే మిశ్రాను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేసినట్లు వర్గాలు తెలిపాయి.

నవంబర్ 26న న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న తన సహ ప్రయాణికురాలైన ఒక 70 ఏళ్ల మహిళపై మద్యం మత్తులో ఉన్న మిశ్రా మూత్ర విసర్జన చేసినట్లు పోలీసు కేసు నమోదైంది. అరెస్టును తప్పించుకునేందుకు బెంగళూరులో అతను తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో ఢిల్లీ పోలీసులు రెండు రోజుల క్రితమే బెంగళూరు పోలీసులను సంప్రదించినట్లు వర్గాలు తెలిపాయి. వైట్ ఫీల్డ్ ప్రాంతంలో మిశ్రా ఆశ్రయం పొందినట్లు తొలుత సమాచారం అందినప్పటికీ అతను తరచు ప్రదేశాలు మారడంతో చివరకు సంజయ్ నగర్‌లో అతడిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News