Monday, January 20, 2025

చెల్లెలి బాయ్‌ఫ్రెండ్‌ను నరికి చంపి, కుక్కలకు తినిపించాడు

- Advertisement -
- Advertisement -

సోదరి బాయ్‌ఫ్రెండ్ ను అన్న దారుణంగా హత్య చేసి, శరీర భాగాలను ముక్కలుగా నరికి, కుక్కలకు ఆహారంగా వేసిన దారుణ సంఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన నలంద జిల్లాలో వెలుగుచూసింది. బిట్టు కుమార్ అనే యువకుడు డిసెంబర్ 16తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు బందువుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. రెండు రోజుల తర్వాత స్థానిక పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ నేపథ్యంలోనే రాహుల్ అనే యువకుడిపై అనుమానం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తమ స్టైల్ లో విచారించగా అసలు నిజం బయటపడింది. బిట్టు తన సోదిరితో సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయానని, అందుకనే అతన్ని హత్య చేశానని తెలిపాడు. డిసెంబర్ 16న శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేశానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. అనంతరం మృతుడి శరీరాన్ని ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశానని, మిగతా వాటిని నదిలో పడేశానని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News