Monday, December 23, 2024

ఇంటి ఓనర్ను చంపి.. సెల్ఫీ తీసుకుని పరారీ

- Advertisement -
- Advertisement -

Man arrested in Delhi for killing house owner

ఢిల్లీలో దారుణం

న్యూఢిల్లీ: ఇంటి యజమానితో ఘర్షణపడిన ఒక కిరాయిదారుడు అతడిని చంపి, శవం పక్కన నిలబడ సెల్ఫీ తీసుకుని పరారయ్యాడు. ఈ దారుణ సంఘటన వాయువ్య ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో సంభవించింది. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల నిందితుడు పంకజ్ కుమార్ సాహ్నిని దాదాపు 250 కిలోమీటర్లు వెంటాడి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..ఈ నెల 10న ఉదయం 6.41 గంటలకు ఒక హత్యకు సంబంధించి ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే మంగోల్‌పురిలోని ఆ ప్రదేశానికి వెళ్లగా తల నుంచి రక్తస్రావం జరుగుతూ అపస్మారక స్థితిలో ఉనన ఒక వ్యక్తి పోలీసులకు కనిపించాడు. ఫోన్ చేసిన జగదీష్(32) చెప్పిన ప్రకారం, కింది అంతస్తులో తాను నివసిస్తుండగా మొదటి అంతస్తులో తన తండ్రి సురేష్ నివసిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం తన తండ్రి సాహ్ని అనే వ్యక్తిని ఇంటికి తీసుకువచ్చి అతను ఒక అనాథని, ఇక నుంచి అతను రెండవ అంతస్తులో ఉంటాడని చెప్పారని జగదీష్ పోలీసులకు వివరించారు.

ఆగస్టు 9వ తేదీ రాత్రి మద్యం తాగి వచ్చిన సాహ్ని తన తండ్రి సురేష్‌తో గొడవపెట్టుకున్నాడని, తాను సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగిందని ఆయన తెలిపారు. ఆగస్టు 10వ తేదీ తెల్లవారుజామున సాహ్ని తనకు ఫోన్ చేసి సురేష్ తనను బూతులు తిట్టడంతో తాను గత రాత్రి 11 గంటలకు ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయానని చెప్పాడని అయితే చివరగా సాహ్ని బిగ్గరగా నవ్వడంంతో సందేహించిన తాను మొదటి అంతస్తులోకి వెళ్లి చూడగా తన తండ్రి రక్తపుమడుగులో పడి ఉన్నాడని జగదీష్ చెప్పారు. పరారీలో ఉన్న సాహ్నిని వెంటాడిన పోలీసులు చివరకు అతడిని మంగోల్‌పురి పారిశ్రామిక వాడలో అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఇంటి యజమాని సురేష్ మొబైల్ ఫోన్, ఇంటి పత్రాలు, నగదుతోపాటు హత్యకు వాడిన సుత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News