Wednesday, January 22, 2025

నగ్న దృశ్యాలు చిత్రీకరిస్తున్న యువకుడిపై ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు

హైదరాబాద్: బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్న యువతి వీడియో తీస్తున్న యువకుడిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం… యూసుఫ్‌గూడకు చెందిన యువతి(30) గత ఏడాది, డిసెంబర్31వ తేదీన ఉదయం తన ఇంట్లో స్నానం చేస్తోంది. అందే ఇంటి పై అంతస్థులో ఉంటున్న అఖిల్ తన సెల్‌ఫోన్‌లో బాత్‌రూము వెంటిలేటర్ ద్వారా వీడియో రికార్డు చేస్తున్నాడు. ఇది గమనించిన బాధితురాలు వెంటనే బయటికి వచ్చి పట్టుకునేలోగా నిందితుడు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News