Sunday, December 22, 2024

తండ్రిని చంపి.. దుప్పటిలో కప్పి ఇంట్లో దాచాడు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలో ఆగస్టు 18వ తేదీ శుక్రవారం నాడు 25 ఏళ్ల యువకుడు తన తండ్రిని కొట్టి చంపాడు. నిందితుడు ధనంజయ్‌ తన తండ్రి గుమ్మడి తిరుపతి (48)ని హత్య చేసి మృతదేహాన్ని మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంచినట్లు పోలీసులు తెలిపారు. తండ్రీకొడుకుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. సంఘటన జరిగిన రోజు, గొడవ తీవ్రమైంది. ధనంజయ్ తన తండ్రిని కొట్టి చంపాడు. నిందితుడు మృతదేహాన్ని దుప్పటిలో కప్పి ఇంట్లో దాచాడు.

ఆగస్టు 20వ తేదీ ఆదివారం ఉదయం ధనంజయ్ మృతదేహాన్ని స్కూటర్‌పై తీసుకెళ్లి చెరువు సమీపంలో పడేయడానికి ప్రయత్నించాడు. అయితే అతని అనుమానాస్పద కార్యకలాపాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు స్థానికుల ఎదుట నేరం అంగీకరించాడు. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే అతడు పరారయ్యాడు. దనంజయ్‌పై కేసు నమోదు చేశామని, అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News