Sunday, December 22, 2024

తల్లిని చంపిన కొడుకు.. పోలీసులకు పట్టించిన తండ్రి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం నగరం రామన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. నవమాసాలు మోసి కని పెంచి కళ్ళల్లో పెట్టుకొని చూసి పెద్దచేసిన తల్లిని ఓ మూర్ఖుడు దారుణంగా కొట్టి హత్య చేశాడు. మృతురాలిని రామలక్ష్మి(55) గా గుర్తించారు. చెడు వ్యసనాలకు బానిసైన నిందితుడు శ్రవణ్ తల్లి ప్రాణాలు తీశాడు. కుమారుడు శ్రవణ్ పై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లిని కుమారుడే కొట్టి చంపాడని పోలీసులు నిర్దారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News