Sunday, January 19, 2025

ఫోన్‌లో అశ్లీల వీడియోలు.. 14 ఏళ్ల కుమారుడిని హతమార్చిన తండ్రి

- Advertisement -
- Advertisement -

పుణె: తన 14 ఏళ్ల కుమారుడి ప్రవర్తనపై తీవ్ర మనస్తాపం, ఆగ్రహం చెందిన ఓ తండ్రి సోడియం నైట్రేట్ కలిపిన శీతల పానీయం తాగించి కన్న కొడుకునే హత్య చేశాడు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. ఆ కసాయి తండ్రిని అరెస్టు చేసినట్లు శుక్రవారం ఒక పోలీసు అధికారి తెలిపారు. తన కుమారుడు విశాల్ బట్టుపై స్కూలు నుంచి తరచు ఫిర్యాదులు రావడంతోపాటు అతను తరచు తన ఫోన్‌లో అశ్లీల వీడియోలను చూస్తుండడం, చదువును నిర్లక్ష్యం చేయడం, తన సోదరితో గొడవలు పడడం వంటి కారణాలతో ఆ బాలుడి తండ్రి విజయ్ బట్టు(43) విసిగిపోయాడని జోధవి పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అజయ్ జగతాప్ తెలిపారు.

స్కూలు నుంచి విశాల్ ఇంటికి తిరిగి రాకపోవడంతో జనవరి 13న విజయ్ బట్టు, ఆయన భార్య కీర్తి పోలీసులకు మిస్సింగ్ పర్సన్ ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు. అదే రోజున తుల్జాపూర్ నాకా వద్ద బాలుడి మృతదేహం లభించిందని, పోలీసులు ప్రమాదవశాత్తు మరణించినట్లు కేసు నమోదు చేశారని అధికారి తెలిపారు. అయితే విజయ్ తండ్రి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించామని ఆయన తెలిపారు. సోడియం నైట్రేట్ కలిపిని కూల్ డ్రింక్ తాగించి తన కుమారుడిని చంపినట్లు విజయ్ బట్టు అంగీకరించాడని ఆయన చెప్పారు. ఆ తర్వాత విశాల్ మృతదేహాన్ని తుల్జాపూర్ నాకా వద్ద వదిలేసి వచ్చినట్లు అతను చెప్పాడని అ ధికారి తెలిపారు. జనవరి 29న విజయ్ బట్టును అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News