- Advertisement -
హైదరాబాద్: నగరంలోని మలక్ పేటలో శనివారం దారుణం చోటుచేసుకుంది. సోదరుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇనుప కట్టర్ తో తమ్ముడిని ఓ అన్నను హత్య చేశాడు. మృతుడిని నవీన్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -