Sunday, December 22, 2024

అత్తమామలను చంపేందుకు యత్నం.. అల్లుడు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లాలో అత్తమామలను చంపేందుకు ప్రయత్నించిన అల్లుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అత్తమామలను కరెంట్ షాక్ తో చంపేందుకు అల్లుడు కుట్ర పన్నాడు. నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావు పేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Also Read: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్నాటకలో అల్లర్లు: అమిత్ షా

ఈ నెల 12 రాత్రి తలుపులకు అల్లుడు రమేష్ కరెంట్ షాక్ పెట్టాడు. ఉదయం లేచి తలుపు తీసిన అత్త విద్యుత్ షాక్ కు గురైంది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు తక్షణమే విద్యుత్ ను నిలిపివేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. విచారణలో అల్లుడే నిందితుడని పోలీసుల తేల్చారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News