- Advertisement -
నెల్లూరు: జిల్లాలోని వెంకటగిరిలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించలేదనే కోపంతో ప్రేమోన్మాది ఓ యువతి గొంతు కోశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సదరు యువతిని ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ప్రేమోన్మాది చెంచుకృష్ణను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Man attack on girlfriend with knife in Nellore
- Advertisement -