Sunday, December 22, 2024

వరుస హత్యలతో హడలెత్తిన భాగ్యనగరం

- Advertisement -
- Advertisement -

వరుస హత్యలతో హడలెత్తిన భాగ్యనగరం
15 గంటల వ్యవధిలో మొత్తం 5 హత్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: వరుస హత్యలతో భాగ్యనగరం హడలెత్తింది. 15 గంటల వ్యవధిలో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు హత్యకు లోనయ్యారు. దీంతో నగర వాసులు తీవ్ర భయాందోళన చెందారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత టప్పాఛబుత్రలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను గుర్తుతెలియని వ్యక్తులు దారణంగా హతమార్చారు. మైలార్‌దేవ్‌పల్లిలో దుండగులు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరిని బండరాళ్లతో కొట్టి అత్యంత పాశవికంగా హత్య చేశారు. తాజాగా చాదర్‌ఘాట్ పోలీసు స్టేషన్‌లో పరిధిలోని అజంపురాలో దుండగులు గుర్తు తెలియని వ్యక్తిని హతమార్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సిసిటివి కెమెరాల్లో రికార్డు అయినట్టుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. టప్పాచబుత్రా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇద్దరు ట్రాన్స్‌జెండర్లపై బుధవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో దుండగులు దాడి చేశారు. వారిపై కనికరం లేకుండా రాళ్లతో దాడి చేసి కత్తితో పొడిచారు. ఫలితంగా వారు అక్కడికక్కడే మరణించారు. “మరణించిన వ్యక్తులు ఇద్దరూ ట్రాన్స్‌జెండర్లు. వారి వయసు 25-30 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుంది” అని ఒక పోలీసు అధికారి వెల్లడించారు.

లింగమార్పిడి బాధితులతో నేరస్తులకు సన్నిహిత సంబంధాలు ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు ప్రస్తుతం నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. కత్తిపోట్లకు ఉపయోగించిన కత్తిని కనుగొన్నారు. ఆ ప్రాంతంలో సిసిటివి ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. మరో ఘటనలో… ఫుట్‌పాత్‌లపై ఆశ్రయం పొందుతున్న ఇద్దరు నిరాశ్రయులైన వ్యక్తులన బుధవారం ఉదయం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరు ప్రదేశాలలో రోడ్డు పక్కన నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు దారుణంగా దాడి చేసి, హత్య చేశారు. మరణించిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. టప్పాచబుత్రాలో చోటుచేసుకున్న ఘటనతో దీనికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

నార్సింగిలో దారుణం.. ప్రియురాలిపై కత్తితో దాడి
హైదరాబాద్ నార్సింగిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియురాలిపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన నార్సింగి గ్రిల్ ట్రీ హోటల్ దగ్గర జరిగింది. గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. విభేదాలు రావడంతో మాట్లాడుదామని పిలిపించాడు. అతని అభ్యర్థన మేరకు నార్సింగి గ్రిల్ ట్రీ హోటల్ దగ్గరికి రాగా, అక్కడ వారిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇంతలో ఆమె మీద కత్తితో దాడిచేశాడా ఉన్మాది. దీంతో ఆమె మెడ, చేతులపై గాయాలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News