Tuesday, April 8, 2025

దారుణం.. తల్లిదండ్రులపై కొడవలి, గడ్డపారతో కుమారుడి దాడి..

- Advertisement -
- Advertisement -

కన్న తల్లిదండ్రులపై ఓ వ్యక్తి విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు. వారిపై కొంచెం కూడా కనికరం లేకుండా కొడవలి, గడ్డపారతో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం రాజారాం గ్రామంలో చోటుచేసుకుంది. భూ వివాదం కారణంగానే తల్లిదండ్రులపై కుమారుడు నరేశ్‌.. దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో తండ్రి నాగరాజు, తల్లి గంగమణికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన దంపతులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News