గర్భిణిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ కామాందుడు.. కదులుతున్న ట్రైన్ నుంచి ఆమెను తోసేసిన దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని కేవీ కుప్పం స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. కోయంబత్తూరు, తిరుపతి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈ ఘటన జరిగింది. చిత్తూరుకు చెందిన ఓ మహిళా గర్భిణి.. ట్రైన్ లో బాత్రూమ్కి వెళ్లిన సమయంలో హేమరాజ్ అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
అయితే, సదరు మహిళ భయంతో అరుస్తున్నా.. వేధింపులకు పాల్పడ్డాడు హేమరాజ్. దీంతో ఆమె కేకలేస్తుండటంతో కదులుతున్న రైలు నుంచి తోసేశాడు. తోటి ప్రయాణికులు గమనించిన.. మహిళను కాపాడారు. అయితే, రైలు నుంచి కిందపడటంతో గర్భిణి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం అందించడంతో కాట్పాడి రైల్వే పోలీసులు నిందితుడు హేమరాజ్ ను అరెస్ట్ చేశారు. అతనిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు సమాచారం. పస్తుతం సదరు మహిళను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.