- Advertisement -
హైదరాబాద్: ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసిన సంఘటన హైదరాబాద్‌లోని బోయిన్పల్లి పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గిరీష్ అనే వ్యక్తి యాప్రాల్‌లోని బాలాజీ నగర్లో నివిసిస్తున్నాడు. చామంతి అనే యువతి సూపర్ మార్కెట్లో పని చేస్తోంది. గత కొన్ని రోజుల నుంచి చామంతి అనే యువతిని ప్రేమిస్తున్నానని లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ప్రతీ సారి అతడి ప్రేమను నిరాకరించడంతో ఆమె చంపాలని అతడు నిర్ణయం తీసుకున్నాడు. కత్తి తీసుకొని యువతి ఇంటికి వెళ్లాడు. ఆమె నడుము, చేతులపై కత్తితో దాడి చేసిన అంతరం తాను కత్తితో పొడుచుకున్నాడు. వెంటనే స్థానికులు ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -