Wednesday, January 22, 2025

సూర్యాపేటలో దారుణం… అన్న చేతిలో తమ్ముడు హతం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట మండల బాలేంల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉప్పుల సైదులు(36)ను పెదనాన్న కుమారుడు ఉప్పుల సతీష్ కొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్యచేశాడు. సోమవారం రాత్రి 9:30 సమయంలో పొలానికి నీళ్ళు పెట్టడానికి వెళ్లిన లింగయ్యపై సతీష్ గొడ్డలితో దాడి చేశాడు.

దీంతో తీవ్రంగా గాయపడిన లింగయ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మరణించాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్ట్ నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా సైదులు, సతీష్ ల మధ్య తరచూ గొడవలు జరుగుతన్నట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News