Wednesday, January 22, 2025

హైదరాబాద్ లో నడిరోడ్డుపై కత్తులతో నరికి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ వ్యక్తిని వెంటపడి కత్తులతో దాడి చేసి దారుణంగా నరికి చంపిన సంఘటన నగరంలోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పురాణాపూల్ నుంచి జియాగూడ కబేళాకు వెళ్లే మూసీ నది పరివాహాక ప్రాంతం 100 ఫీట్ రోడ్డులో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….అంబరేపేటకు చెందిన జనగామ జగన్ కుమారుడు జనగాం సాయికుమార్(30) ఇసామియా బజార్‌లోని గ్లాస్ కటింగ్ వర్క్ పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో పురాణాపూల్ 100 ఫీట్ రోడ్డుపై నుంచి బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కత్తులతో దాడి చేశారు.

వెంటనే సాయికుమార్ బైక్‌ను అక్కడే పడేసి పరెగుత్తగా అతడిని ముగ్గురు నిందితులు వెంటపడి కత్తులతో దాడి చేశారు. పరిగెత్తుకుంటూ రోడ్డుపై పడిపోయిన సాయికుమార్‌ను ముగ్గురు నిందితులు కత్తులతో నరికి చంపారు. హత్య జరుగుతుండగా స్థానికులు చాలామంది గుమ్మికూడినా కూడా ఎవరూ అడ్డుకోలేదు. బాధితుడిని హత్య చేసిన నిందితులు ముగ్గురు మూసీ నదిలో దూకి పారిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే సరికి నిందితులు పారిపోయారు. సిసి కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని, నిందితులను పట్టుకునేందుకు ఆరు టీములను ఏర్పాటు చేశామని గోషమహల్ ఎసిపి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కుల్సుంపుర పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News