Wednesday, January 22, 2025

ప్రేమిస్తాలేదని.. క్యాంపస్‌లో యువతిపై బ్లేడ్‌తో దాడి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: సంగారెడ్డిలో జిల్లాలో బుధవారం దారుణం చేసుకుంది. తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్యాంపస్‌లో ఓ యువతి బ్లేడ్‌ దాడికి గురై మృతి చెందింది. ఈ ఘటన స్థానింగా కలకలం రేపింది. మనూరు మండలం తిమ్మాపూర్‌కు చెందిన తెనుగు అఖిల (21) అనే బాధితురాలిని నారాయణఖేడ్‌లోని పోతంపల్లికి చెందిన ప్రవీణ్‌కుమార్ (22) దాడి చేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. అఖిల తన నాల్గవ సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కళాశాల ఆవరణలో అఖిల ఉన్నట్లు ప్రవీణ్‌కు తెలిసి తనతో పాటు తెచ్చుకున్న బ్లేడ్‌తో ఆమె మెడ, చేతులు లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డాడు. ఆమె సహవిద్యార్థులు త్వరితగతిన చర్యలు తీసుకోవడంతో దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని వెంటనే పోలీసులకు అప్పగించారు.

తక్షణమే అఖిలను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ నిమిత్తం పోలీసులు ఆమెను స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రవీణ్ తనను ప్రేమించడం లేదన్న కోపంతో అఖిలపై దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News