Friday, December 27, 2024

ఆస్థి పంపకాలలో కోడలి పై మామ దాడి

- Advertisement -
- Advertisement -

గణపురంః ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో కోడలి పై మామ దాడి చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బాధితురాలు కేశెట్టి లావణ్య కథనం మేరకు గ్రామానికి చెందిన కేశెట్టి మల్లయ్య కుమారుడు గిరిబాబుతో లావణ్యకు వివాహామై చాలా కాలమైంది. భర్త గిరిబాబు నాలుగేళ్ల క్రితం ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో మృతి చెందాడు. అనంతరం ఆస్తి పంపకాలు చేసుకున్నారు.

కాగా తన వాటా కింద వచ్చిన ఎకరం పొలాన్ని దక్కించుకునేందుకు మామ మల్లయ్య తరచూ ఆమెను బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. కాగా శనివారం పొలంలో మామ మల్లయ్య నాటు వేస్తున్నాడని పొలం వద్దకు లావణ్య వెళ్ళింది. దీంతో కోపోద్రిక్తుడైన మామ పారతో కోడలిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. లావణ్యకు తనకు బలమైన గాయాలు కావడంతో 108లో ములుగు సివిల్ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News