Wednesday, April 16, 2025

టోల్ డబ్బులు అడిగినందుకు సిబ్బందిపై దాడి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: రాజేంద్రనగర్ ఎగ్జిట్ 17వ టోల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టోల్ గేట్ డబ్బులు చెల్లించమని అడిగినందుకు కొందరు వ్యక్తులు టోల్ సిబ్బందిపై విచక్షణరహితంగా దాడి చేశారు. దాడికి పాల్పడిన వాళ్లు జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ సిద్ధికి అతని కుటుంబ సభ్యులుగా గుర్తించారు. తన కారుకు టోల్ మినహాయింపు ఇవ్వాలని హుస్సేన్ సిద్ధికి అడగగా. టోల్ మినహాయింపు లేకపోవడంతో డబ్బులు చెల్లించాలని టోల్ సిబ్బంది కోరారు. దీంతో తన వాహనం ఆపినందుకు టోల్ సిబ్బందిపై ఆగ్రహంతో సిద్ధకి అతని కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ గొడవను అడ్డుకోబోయిన ఇతర టోల్ సిబ్బందిపై కూడా హుస్సేన్ సిద్ధికి దాడి చేశారు. సిద్ధికి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. హుస్సేన్ సిద్ధికి తోపాటు అతని కుటుంబ సభ్యులపైనా పోలీసులకు టోల్ సిబ్బంది పిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News