- Advertisement -
హైదరాబాద్: నగరంలోని మలక్ పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పిఎస్ వద్ద తన మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన విజయ్ అనే వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. తన భార్యను వేధిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడంలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
అందుకే పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితుడు తెలిపాడు. దీంతో స్పందించిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -