Sunday, January 19, 2025

మసీదు అల్ హరమ్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నం!

- Advertisement -
- Advertisement -

రియాద్: మక్కాలోని పెద్ద మసీదైన ‘అల్ హరమ్’  పై అంతస్తు నుంచి దూకి చనిపోదామని ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పూనుకున్నాడు. కానీ అక్కడి ప్రత్యేక భద్రతా బలగాలు వెంటనే స్పందించి , అతడిని సురక్షితంగా కాపాడాయి. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి కావలసిన చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ వ్యక్తి వివరాలను వెల్లడించలేదు.

‘అవసరమైన ప్రొసీజర్లన్నీ పూర్తి చేశాము’ అని మాత్రమే అక్కడి ప్రత్యేక భద్రతా బలగం సోషల్ మీడియా పేజీలో పేర్కొంది. 2017లో కూడా ఇలాంటి ఉదంతమే జరిగింది. అప్పట్లో ఓ వ్యక్తి కాబా ముందు తనను తాను కాల్చుకునేందుకు యత్నించాడు. ఇక 2018లో ఓ 26 ఏళ్ల యాత్రికుడు మసీద్ అల్ హరమ్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో అది ఇతర పవిత్ర యాత్రికులను, మసీదులో మొక్కులు చెల్లించుకునే వారిని షాక్ కు గురిచేసింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News