Sunday, December 22, 2024

నాగుపాముకి స్నానం చేయించిన వ్యక్తి (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

కొన్ని వీడియోలు నెటిజన్‌లను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. అయితే కొన్ని వీడియోలు వీక్షకులు ఇంతకు ముందెన్నడూ చూడని వాటిని చూపడం వల్ల సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారుతుంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే, ఇటీవల ఓ వ్యక్తి అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటైన నాగుపాముకి బాత్‌రూమ్‌లో స్నానం చేయిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

ట్విట్టర్ వినియోగదారు జిందగీ గుల్జార్ హై దానిని ట్విట్టర్ షేర్ చేయడంతో ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో, బాత్‌రూమ్‌లో ఒక వ్యక్తి, పాము కనిపించడంతో ఆ వ్యక్తి మగ్‌తో పాముపై నీరు పోశాడు. దీంతో నాగుపాము తన నోటితో మగ్ ను పట్టుకోవడానికి ప్రయత్నించడం గమనించవచ్చు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండగా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ వీడియోపై మీరు ఒక్క లుక్ వేయండి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News