Monday, December 23, 2024

మద్యం… ఫోన్ దొంగతనం చేశాడని స్నేహితుడి హత్య

- Advertisement -
- Advertisement -

Dead body

కోల్‌కతా: ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా ఫోన్ పోవడంతో సదరు వ్యక్తి తీశాడనే నెపంతో అతడిని కొట్టి చంపిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంఇ.. నయపట్ట బజారులో రాజు మాల్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్నాడు. స్నేహితులలో ఒక వ్యక్తి ఫోన్ పోవడంతో రాజుపై అనుమానం వ్యక్తం చేశాడు. రాజు తాను తీయలేదని చెప్పిన కూడా అతడిపై ముగ్గురు స్నేహితులు దాడి చేశారు. అతడిని నెట్టివేయడంతో కిందపడిపోయాడు. మరో వ్యక్తి అతడి ఛాతీ భాగంలో బలంగా కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. రాజు కుటుంబ సభ్యులు ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితులలో ఒకరిని పట్టుకున్నారు. ఇంకా ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News