Thursday, December 26, 2024

బీఫ్ మాంసం తరలిస్తున్నారన్న అనుమానంతో ముస్లిం వ్యక్తి హత్య

- Advertisement -
- Advertisement -

ముంబై : బీఫ్ మాంసం తరలిస్తున్నారన్న అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని కొందరు కొట్టి చంపిన సంఘటన వెలుగు లోకి వచ్చింది. నాసిక్ జిల్లాలో శనివారం ఈ దారుణం జరిగింది. ముంబై కర్లా ప్రాంతానికి చెందిన అన్సారీ (32) తన స్నేహితుడు నాసిర్ షేక్‌తో కలిసి కారులో మాంసాన్ని తీసుకు వెళ్తున్నాడు. నాసిక జిల్లా వద్ద వీరి కారును కొందరు గోసంరక్షకులు అడ్డగించి ఇద్దరినీ దారుణంగా కొట్టి అక్కడ నుంచి పారిపోయారు.

ఈ సమాచారం తెలిసి పోలీస్‌లు అక్కడకు చేరుకుని తీవ్రగాయాలతో ఉన్న ఇద్దరినీ వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అన్సారీ మృతి చెందాడని సబ్ ఇన్‌స్పెక్టర్ సునీల్ బామ్రే తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పది మందిని అదుపు లోకి తీసుకున్నారు. వారు తరలిస్తున్న మాంసం బీఫా కాదా అనేది ల్యాబ్ పరీక్షల్లో తెలుస్తుందని ఆయన వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News