Wednesday, December 25, 2024

హుక్కా తాగిన కొడుకుకు పదిమందిలో తండ్రి దేహశుద్ధి(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

వెబ్‌డెస్క్: కోచింగ్ క్లాసులకు వెళుతున్నానని చెప్పి తన స్నేహితులతో కలసి కేఫ్‌లో హుక్కా పీలుస్తున్న కొడుకుకు ఓ తండ్రి బహిరంగంగా దేహశుద్ధి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కోచింగ్ క్లాసులకు బంకు కొట్టి తన స్నేహితులతో కలసి కేఫ్‌లో హుక్కా పీలుస్తున్న కుమారుడిని అతని తండ్రి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. టెలిఫోన్‌లో నేనేం అడిగాను..నువ్వు నాకేం చెప్పావు అంటూ ఆ తండ్రి కొడుకును నిలదీయడం వీడియోలో కనిపించింది. బురఖా ధరించి ఉన్న అతని భార్య కూడా తన కొడుకు నిర్వాకాన్ని కళ్లారా చూసి కోపంతో మండిపడడాన్ని ఇందులో చూడవచ్చు.

తన కొడుకుతోపాటు అతని స్నేహితులకు కూడా ఆ తండ్రి నాలుగు తగిలించాడు. కోచింగ్ క్లాసులకు బంకు కొట్టి వీరంతా కేఫ్‌లో కూర్చుని హుక్కా తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తమలో ఒకరి తండ్రి ఇలా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని తమను ఉతికి ఆరేస్తాడని వారు ఊహించలేదు. కాగా.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం వివరాలు తెలియరాలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News