Monday, December 23, 2024

పొట్టేలు తల బదులు మనిషి తల నరికివేత

- Advertisement -
- Advertisement -

Man beheaded friend in Madanapalle

మదనపల్లె: చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మండలం వలసపల్లెలో దారుణం చోటుచేసుకుంది. ఎల్లమ్మ గుడి వద్ద పొట్టేలును బలి ఇచ్చే ఘటనలో వ్యక్తి మృతిచెందాడు. మద్యం మత్తులో బలి ఇచ్చే పొట్టేలు తల బదులు మనిషి తల నరికాడు స్నేహితుడు. మృతుడిని టి.సురేష్ (35)గా గుర్తించారు. పశువుల పండుగలో ఎల్లమ్మకు బలిచ్చే సమయంలో పొట్టేలు అనుకుని సురేష్ అనే యువకుడి తలను నరికాడు చలపతి అనే వ్యక్తి. ఆ రక్తపు మడుగులో కుప్పకూలిన బాధితుడిని స్థానికులు తక్షణమే మదనపల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కొల్పోయాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రూరల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News