Saturday, December 21, 2024

దుబాయ్‌లో జిన్నారం వాసి మృతి..

- Advertisement -
- Advertisement -

Man belongs to Jinnaram Dies in Dubai

మనతెలంగాణ/హైదరాబాద్: ఇటీవల దుబాయ్‌లో కురిసిన భారీ వర్షాలకు ఫుజాయిరహ్ సిటీలో వరద నీరు ముంచెత్తడంతో మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ నివాసి ఉప్పు లింగారెడ్డి(35) మృతి చెందాడు. ఈ క్రమంలో లింగారెడ్డి మృతి చెందిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తోటివారు తెలియజేశారు. మృతుడికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉపాధి నిమిత్తం రెండు నెలల క్రితమే దుబాయ్‌కి లింగారెడ్డి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. లింగారెడ్డి మృతదేహాన్ని వీలైనంత త్వరగా సొంతూరు తెప్పించేలా చర్యలు తీసుకోవాలని లింగారెడ్డి తల్లి లక్ష్మీభాయ్, భార్య శిరీష రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Man belongs to Jinnaram Dies in Dubai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News