Sunday, December 22, 2024

భార్యతో గొడవ.. చెరువులో దూకి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

పాపన్నపేటః కుటుంబ కలహాలతో మద్యం మత్తులో చెరువులో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యచేసుకున్న సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని యూసుఫ్‌పేట గ్రామ ఊరచెరువు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై విజయ్‌కుమార్ కథనం ప్రకారం… గ్రామానికి చెందిన బత్తిని ప్రసాద్(38)కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసగా మారి పని చేయకుండా ఉంటున్నాడు. ఇదే విషయమై తరుచూ భార్యభర్తల మద్య గొడవలు జరుగుతున్నాయి.

సోమవారం రాత్రి సమయంలో ప్రసాద్ బాగా తాగి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఇంట్లో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అదే మత్తులో చెరువులో మునిగి ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యులు చుట్టూ పక్కల వెతికారు. చివరికి చెరువు తూము వద్ద ప్రసాద్ చెప్పులు, బట్టలు కనిపించాయి. అనుమానం వచ్చి చెరువులో గాలించగా ప్రసాద్ మృతదేహం లభ్యమైంది. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News