Monday, December 23, 2024

సారపాకలో వ్యక్తి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

బూర్గంపాడు: వ్యక్తి దారుణ హత్యకు గురయిన ఘటన సారపాకలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం బూర్గంపాడు మండల పరిదిలోని సారపాకకు చెందిన సయ్యద్ రఫీ (37) ఐటీసీ కర్మాగారంలో క్యాజువల్ లేబర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రఫీ శుక్రవారం మధ్యహ్నం విధులకు హజరై రాత్రికి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో నిద్రిస్తున్న రఫీ హత్యకు గురై తీవ్ర గాయాలతో మృతి చెందాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు ఎస్‌ఐ సంతోష్ కేసు నమోదు చేసుకుని మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. సంఘటనా స్థలాన్ని పాల్వంచ డీఎస్పీ వెంకటేష్, సీఐ నాగరాజు, ఎస్‌ఐ సంతోష్, క్లూస్ టీం సిబ్బంది సందర్శించి వివరాలు సేకరించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News