Thursday, December 26, 2024

పురుగుమందు తాగి యువతి మృతి… ప్రియుడిని చంపి పక్కనే పాతిపెట్టిన తండ్రి

- Advertisement -
- Advertisement -

man brutally murdered in eluru district

అమరావతి: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గొడుగు పేటలో పవన్ కళ్యాణ్ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఈనెల 15న ఇంటి నుంచి బయటకు వెళ్లి పవన్ కళ్యాణ్ అదృశ్యమైయ్యాడు. ఐదు నెల క్రితం పవన్ కళ్యాణ్ ప్రేమించిన శ్యామల అనే యువతి పురుగులమందు తాగి మృతి చెందింది. తన కూతురి మృతికి పవన్ కళ్యాణ్ ఏ కారణమని కక్ష పెంచుకున్న శ్యామల తండ్రి నాగేశ్వరరావు పవన్ ను చంపి శ్యామల సమాధి సమీప ప్రాంతంలో పూడ్చిబెట్టాడు. జంగారెడ్డిగూడెం డిఎస్పి, సీఐ భీమడోలు సీఐ, లక్కవరం పోలీసులు ద్వారకాతిరుమల రెవెన్యూ అధికారులు ఆధ్వర్యంలో మృతదేహాన్ని బయటకు తీశారు. నిందితుడు నాగేశ్వరరావు మృతుడి చేతులు కాళ్లు కట్టేసి, గొనె సంచలో పెట్టి, బరకం చుట్టి పాతిపెట్టాడు. రక్తపు ముద్దగా మృతదేహం బయటపడింది. దారుణంగా కొట్టి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News