Sunday, December 22, 2024

ప్రధాన రహదారిపై మృతదేహం.. గొంతుకోసి వ్యక్తి హత్య

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా సిటీ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం దారుణం చోటుచేసుకుంది. జన్వాడ మెకన్ గడ్డ ప్రధాన రహదారిపై దుండగులు గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోసి దారుణం హత్య చేశారు. తెల్లవారుజామున మృతదేహాన్ని చూసిన స్థానికులు నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం హత్యకు గురైన వ్యక్తి వివరాలను సేకరిస్తున్నారు. ఘటనా స్థలంలో ఉన్న
సి.సి ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News