- Advertisement -
సారంగపూర్: నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహబూబ్ ఘాట్ వద్ద బుధవారం దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి హత్య జరిగింది. మృతుడు సారంగపూర్ యాకర్ పల్లి వాసి శంకర్ (45)గా గుర్తించారు. చంపిన తర్వాత మృతదేహాన్ని ఆటోలో తరలించి రోడ్డు పక్కన పడేశారు దుండగులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
- Advertisement -