Sunday, February 23, 2025

భువనగిరి శివారులో దారుణం..

- Advertisement -
- Advertisement -

భువనగిరి క్రైం: యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం, అనంతారం గ్రామ శివారులోని వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంతో సహా మంటల్లో కాలుతున్న వ్యక్తిని, వాహనాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. భువనగిరి రూరల్ సిఐ ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎస్‌ఐ సంతోష్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించారు. మృతుడు కాగజ్‌నగర్‌కు చెందిన నాగరాజుగా గుర్తించారు. వృత్తిరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటన స్థలంలో క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించి ఎవరైనా హత్య చేశారా?

లేక ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతుడు నాగరాజు తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారని, అనంతరం డ్రైవర్‌గా హైదరాబాద్‌లో పనిచేసుకుంటున్నాడని తెలిపారు. 15 సంవత్సరాల నుండి నాగరాజు మధుమేహ వ్యాధితో భాదపడుతున్నట్లు మృతుడి సోదరుడు ములుకల సుభాష్ తెలిపాడు. నాగరాజు అనారోగ్య సమస్యలతో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునని మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భువనగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేసినట్లు భువనగిరి గ్రామీణ ఎస్‌ఐ వి.సంతోష్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News