Thursday, January 23, 2025

డాడీ… గోదావరిలో దూకేస్తున్నా…

- Advertisement -
- Advertisement -

అమరావతి: బ్యాంకు వాళ్లు రుణం తీర్చామని అడిగారనో… ఏమైందో ఏమో కానీ ఓ యువకుడు తన తండ్రికి ఫోన్ చేసి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కొడమంచలి గ్రామానికి చెందిన శివ కుమార్ తన గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఓ బ్యాంక్ క్రెడిట్ కార్డు తీసుకొని రుణం తీసుకున్నాడు. రుణం చెల్లించకపోవడంతో బ్యాంకు సిబ్బంది పలుమార్లు అతడికి కాల్ చేశారు. బ్యాంకు సిబ్బంది ఇంటికి వచ్చి అడగడంతో మంగళవారం ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. 12 గంటలకు తండ్రికి ఫోన్ చేసి తాను గోదావరిలో దూకుతున్నానని చెప్పాడు. వంతెనకు సమీపంలో ద్విచక్రవాహనం, చెప్పులు, సెల్ ఫోన్ ను గుర్తించారు. శివ కుమార్ భార్య తులసి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News