భోపాల్ : కనీస సదుపాయాలు అందక పేదలు, మారుమూల ప్రాంత ప్రజలు హృదయ విదారక పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. ఇలాగే ఓ వ్యక్తి నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని మోసుకుంటూ బస్టాండ్ వరకూ వెళ్లాడు. తన ఊరు చేరుకోవడానికి ఇతర ప్రయాణికుల మాదరిగానే బస్సులో ప్రయాణించా డు. మృతదేహంతోపాటుగా అతడు నడుచుకుంటూ వెళ్తోన్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. నాలుగేళ్ల చిన్నారి తన స్వగ్రామంలో ప్రమాదవశాత్తు మృతి చెందింది. దాంతో పోస్ట్‌మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఛాతర్‌పుర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు.
కానీ తిరిగి వచ్చే సమయంలో చిన్నారి సమీప బంధువు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నాడు. మృతదేహాన్ని తరలించడానికి ఆస్పత్రి వద్ద ఎటువంటి వాహనం అందుబాటులోలేదు. మరోపక్క ప్రైవేటు వాహనంలో ఊరు వెళ్లేందుకు సరిపడా డబ్బులు లే వు. దాంతో చిన్నారి మృతదేహాన్ని భుజం మీదే మోసుకుంటూ బస్టాండ్ వద్దకు వెళ్లాడు. అందరి ప్రయాణికులతో పాటే తన ఊరు వెళ్లే బస్సు ఎక్కాడు. టికెట్‌కు డబ్బులు లేకపోవడంతో తోటి ప్రయాణికుడు ఒకరు సహాయం చేశారు. కొద్ది నెలల క్రితం ఇదే ఆస్పత్రికి వచ్చిన ఓ కుటుంబానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ వరుస ఘటనల నేపథ్యంలో ఛాతర్‌పుర్ ప్రాంతంలో అత్యవసర సదుపాయాల అందుబాటుపై ప్రశ్నలు వస్తున్నాయి.
Video: Body On Shoulder, Madhya Pradesh Man Walks On Busy Road To Bus Stop https://t.co/5VofCaSQ7f pic.twitter.com/PPyJddQqnQ
— NDTV (@ndtv) October 20, 2022