Sunday, December 22, 2024

ఇంటినే ల్యాబ్ చేసిన డ్రగ్స్ విక్రేత

- Advertisement -
- Advertisement -

Man caught selling drugs in Kondapur Hyderabad

రెండేళ్ల పాటు ప్రయోగాలు చేసిన నిందితుడు
విజయం సాధించడంతో విక్రయాలు ప్రారంభించాడు
గ్రాముకు రూ.8వేలు

హైదరాబాద్: డ్రగ్స్ విక్రయిస్తు పట్టుబడ్డ నిందితుడిని విచారించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. కొండాపూర్‌లో ఉంటున్న శ్రీరామ్‌ను పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారణ చేయగా చాలా విషయాలు బయటపడ్డాయి. సూర్యాపేట జిల్లాకు చెందిన శ్రీరామ్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్‌కు ఉద్యోగం కోసం వచ్చాడు. చదువుకునే రోజుల్లోను మత్తుపదార్థాలకు బానిసగా మారిన శ్రీరామ్ ఇక్క ఉద్యోగం చేయకుండా వ్యసనాలకు బానిసగామారాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన శ్రీరామ్ తాను డ్రగ్స్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. మత్తు పదార్థాల తయారీ విధానం తెలుసుకునేందుకు ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేశాడు. హిమాలయాలు, రిషికేస్ తదితర ప్రాంతాలకు వెళ్లి అక్కడ విదేశీ పర్యాటకుల నుంచి డిఎంటి తయారీ విధానాన్ని తెలుసుకున్నాడు.

డ్రగ్స్ తయారీకి వాడే వస్తువులను ఈ కామర్స్ వెబ్‌సైట్లు, స్థానికంగా ఉన్న కెమికల్ ల్యాబ్‌ల్లో కొనుగోలు చేశాడు. కొండాపూర్‌లో ఉంటున్న తన ఇంటినే ల్యాబ్ మార్చి ప్రయోగాలు చేశాడు. దాదాపు రెండేళ్లు ప్రయోగాలు చేసిన తర్వాత మత్తు పదార్థాలు తయారు చేశాడు. తాను తయారు చేసిన మత్తుపదార్థాలను తనపై, తన స్నేహితులకు ఇచ్చి ప్రయోగాలు చేశాడు. ఇవి విజయవంతం కావడంతో విక్రయాలు ప్రారంభించాడు. ఒక గ్రాముతో 20మందికి కిక్కు ఇస్తుందని తెలుసుకున్నాడు. మత్తు పదార్థాలను సేవించేందుకు ప్రత్యేక పరికరాలను కూడా సేకరించి విక్రయించడం ప్రారంభించాడు. తాను తయారు చేసిన డ్రగ్స్ ఆవిరి రూపంలో తీసుకోవాలని వినియోగదారులకు చెప్పాడు. గ్రాముకు రూ.8,000లకు విక్రయించడం ప్రారంభించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News