ఢిల్లీ: లాడ్జ్‌లో సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ తన భార్య చేతిని నరికిన సంఘటన ఢిల్లీలోని ఆదర్శనగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన సతీష్ కుమార్ కుశ్వాహ(32) అతడి భార్య కలిసి ఢిల్లీలోని ఓ హోటల్‌లో రూమ్ తీసుకున్నారు. సతీష్ సిఆర్‌పిఎఫ్‌లో జవాన్‌గా పని చేస్తున్నారు. అనంతరం ఇద్దరు కలిసి మీల్స్ తెప్పించుకొని భోజనం చేశారు. ఇద్దరు మధ్య గొడవ జరగడంతో భార్య చేతిని భర్త నరకడంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో సిబ్బంది వచ్చి ఆమెను బాబు జగ్జీవన్ రామ్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను సఫ్దార్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు రెండు గంటల పాటు ఆపరేష్ చేసి చేతిని అతికించారు. ఇద్దరు మధ్య గొడవలు జరగడంతో తనపై భర్త దాడి చేశాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: దళిత యువకుడిని చంపి, తల్లిని వివస్త్రను చేసి…