Monday, December 23, 2024

భార్యకు ప్రభుత్వ ఉద్యోగం… విడిచి వెళ్లిపోతుందని చేయిని నరికేశాడు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: భార్యకు ప్రభుత్వం ఉద్యోగం రావడంతో తనని విడిచి వెళ్తుందనే భయంతో ఆమె చేతిని భర్త నరికేసిన సంఘటన పశ్చిమ బెంగల్‌లోని తూర్పు బర్ధమనాన్ జిల్లా కోజల్సా గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోజల్సా గ్రామంలో షేర్ మహమ్మద్-రేణు ఖాతూన్ అనే దంపతులు నివసిస్తున్నారు. దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లో రేణు నర్సింగ్ శిక్షణ తీసుకుంది. ప్రభుత్వ పరీక్షలో పాస్ కావడంతో ఆమెకు నర్సుగా ప్రభుత్వం ఉద్యోగం వచ్చింది. రేణు ఉద్యోగం చేయడం భర్తకు ఇష్టం లేదు. దీంతో దంపతుల మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకొని ఆమె కుడి చేతిని భర్త నరికేశాడు. వెటనే స్థానికులు స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె చేతిని వైద్యులు తొలగించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రస్తుతం భర్త పరారీలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News