Monday, January 20, 2025

స్నేహితుడి మర్మాంగాన్ని కట్ చేసి….

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: మద్యం మత్తులో ఓ వ్యక్తి తన స్నేహితుడి మర్మాంగాన్ని కట్ చేసిన సంఘటన ఒడిశా రాష్ట్రం కేంద్రాపారా జిల్లాలో జరిగింది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. రాజ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భగబాత్ దాస్(30), అక్షయ్ రౌత్ ఇద్దరు కలిసి పెంతా బీచ్‌కు వెళ్లారు. ఇద్దరు మద్యం ఫుల్‌గా తాగారు. ఇద్దరు మధ్యగొడవ జరగడంతో అక్షయ్ రౌత్ పదునైన ఆయుధం తీసుకొని భగబాత్ దాస్ మర్మాంగాన్ని కట్ చేశాడు. దీంతో రౌత్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. స్థానికులు వెంటనే దాస్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడి నుంచి కటక్‌లో ఎస్‌సిబి మెడికల్ కాలేజీకి తరలించారు. పోలీసులు ఐపిసి 307 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రౌత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News