Thursday, January 23, 2025

అంధురాలైన తల్లిని విమానంలో వదిలేశారు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అంధురాలైన తన తల్లిని విమానంలో వదిలేశారని ఒక వ్యక్తి ఆరోపించాడు. విస్తారా ఎయిర్‌లైన్స్ తీరుపై మండి పడ్డాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. నెటిజన్లు కూడా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. దీనిపై స్పందించిన ఆ సంస్థ క్షమాపణలు చెప్పింది. ఆ వ్యక్తి నుంచి వివరాలు కోరింది. అంధురాలైన తన తల్లి ఆగస్ట్ 31న ఢిల్లీ నుంచి కోల్‌కతాకు విస్తారా విమానంలో ఒంటరిగా ప్రయాణించినట్టు ఆయుష్ కేజ్రీవాల్ తెలియజేశాడు. అంధురాలు కావడంతో ప్రయాణంలో ఆమెకు సహకరించే విధానాన్ని టికెట్ బుకింగ్ సందర్భంగా ఎంచుకున్నట్టు చెప్పాడు.

కాగా, విమానం కోల్‌కతా చేరిన తరువాత తన తల్లిని వేచి ఉండమని సిబ్బంది చెప్పారని, అయితే ప్రయాణికులు అంతా దిగిపోగా, విమానంలో ఒంటరిగా ఆమె ఉండిపోయిందని, ఆయుష్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరకు క్లీనింగ్ సిబ్బంది గమనించి విమాన సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అప్పుడు తన తల్లిని విమానం నుంచి కిందకు దించారని తెలిపారు. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఆయుష్ కేజ్రీవాల్ వీడియో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎయిర్‌లైన్స్ స్పందించి క్షమాపణలు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News