- Advertisement -
హైదరాబాద్: మద్యం కోసం గొడవపడి ఓ భర్త ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ప్రాణాలు కోల్పోయిన సంఘటన మలక్ పేట పరిధిలోని అక్బర్ బాగ్ లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… అక్బర్ బాగ్ లో ఉండే వ్యక్తి మద్యానికి బానిసైయ్యాడు. మద్యం కోసం భార్యతో కొట్లాడి ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి విద్యుత్ వైర్లు పట్టుకున్నాడు. దీంతో విద్యుదాఘాతంతో వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
drunken man climbed power transformer and died
- Advertisement -