Sunday, December 22, 2024

అత్తగారు కట్న కానుకలు పెట్టలేదని అలిగిన అల్లుడు.. కరెంట్ స్తంభం ఎక్కి…

- Advertisement -
- Advertisement -

కరెంట్ స్తంభం ఎక్కి వ్యక్తి హల్‌చల్
అత్తగారు కట్న కానుకాలు పెట్టలేదని అలిగిన అల్లుడు

మెదక్ : కట్న కానుకల కింద అత్తగారు బంగారం పెట్టలేదని అలిగిన ఒక అల్లుడు కరెంటు స్తంభం ఎక్కి హల్‌చల్ సృష్టించాడు. ఈ సంఘటన పట్టణంలోని గాంధీ నగర్ విధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… పట్టణానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి గతంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. పట్టణంలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటూ ఎలక్ట్రిషన్‌గా పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.

అయితే తమ పెళ్లయినప్పటికి కూడా తన అత్తగారు తనకు కనీసం కట్న కానుకలు, బంగారం కూడా పెట్టలేదని ఏకంగా విద్యుత్‌స్థంభాన్ని ఎక్కాడు. దీంతో స్థానికులు గుర్తించి వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయగా ప్రాణం దక్కింది. పోలీసులు,ఫైర్ సిబ్బంది సాయంతో శేఖర్‌ను కిందికి దింపి పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమో దు చేశారు. విషయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి ఇరువర్గాల పెద్దలతో మాట్లాడి సమస్యను సద్దుమణిగేలా చేస్తానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News