Sunday, December 22, 2024

జిమ్​లో వర్కౌట్స్ చేస్తూ.. యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

రామయ్య బౌలి: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రామయ్య బౌలి ప్రాంతానికి చెందిన జునైద్ అనే యువకుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన చుట్టు పక్క వారు అతనిని సమీప ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జునైద్ ప్రాణాలు కోల్పోయాడు. జిమ్ యజమాని ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాదచాయాలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News