Friday, December 20, 2024

ఔటర్ రింగ్ రోడ్డులో ఫ్లైఓవర్ పైనుంచి దూకి…

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: ఔటర్ రింగ్ రోడ్డులో ఫ్లైఓవర్ పైనుంచి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమప్ప అనే వ్యక్తి నార్సింగి మున్సిపల్ కేంద్రంలో నివసిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఫ్లైఓవర్ పైనుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై దూకాడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడు నారాయణ్ పేట జిల్లా మద్దూరు మండలం చింతల్ పేట గ్రామ వాసిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని పోలీసులు వెల్లడించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News